Bunny Vasu: అల్లు అర్జున్ పుట్టినరోజుకి ఆ అప్డేట్ ఉండబోతుంది.

by Pulgam srinivas |

బన్నీ వాసు మాట్లాడుతూ... ఏప్రిల్ 8వ తేదీన అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలిపారు.

Bunny Vasu: అల్లు అర్జున్ పుట్టినరోజుకి ఆ అప్డేట్ ఉండబోతుంది.
X

దిశ, వెబ్ డెస్క్: సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కు అత్యంత ఆప్తులైన వారిలో బన్నీ వాసు ఒకరు. ఈయన అల్లు అర్జున్ సినిమాలకు సంబంధించిన అనేక విషయాలను దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియోతో పాటు, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ఈ సినిమాలో భాగమైనట్లు తెలియజేస్తూ మేకర్స్ ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.

అయితే, ఈ వీడియోల తర్వాత మూవీ కంటెంట్‌కు సంబంధించిన మరే వివరాలు మాత్రం బయటకు రాలేదు. ఇదిలా ఉంటే, ఏప్రిల్ 8వ తేదీ అల్లు అర్జున్ పుట్టినరోజు కావడంతో, ఆ రోజున ఈ సినిమా నుండి భారీ అప్డేట్ వస్తుందని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా బన్నీ వాసు ఓ సినిమా ఈవెంట్‌లో భాగంగా మాట్లాడుతూ... ఏప్రిల్ 8న అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం బన్నీ వాసు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

Next Story