- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Malayala Movie: మలయాళ సినిమాను అభినందించిన బన్నీ.. వైరల్ అవుతున్న పోస్ట్
తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరైన మలయాళ యంగ్ హీరోల్లో ఉన్ని ముకుందన్

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరైన మలయాళ యంగ్ హీరోల్లో ఉన్ని ముకుందన్ ( unni mukundan ) కూడా ఒకరు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన 'జనతా గ్యారేజ్' మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఈ మూవీలో మోహన్ లాల్ కొడుకుగా నెగిటివ్ రోల్ లో కనిపించి అందర్నీ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత 'భాగమతి' మూవీలో అనుష్క లవర్ గా మెప్పించారు.
ఆయన హీరోగా నటించిన కొత్త సినిమా 'మార్కో' ( Marco ) డిసెంబర్ 20న రిలీజ్ అయి భారీ విజయాన్ని అందుకుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళం, బాలీవుడ్లో కూడా మంచి కలెక్షన్లు వసూలు చేస్తుంది. సినిమాలో హింస, రక్తపాతం ఉందని కొన్ని నెగిటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ, ఆడియెన్స్ తో మంచి మార్కులు వేపించుకుంది.
ముఖ్యంగా, యువతకి బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమాని భారీ సంఖ్యలో థియేటర్లకు వెళ్లి చూస్తున్నారు.అలాగే, ఈ మూవీ ఉన్ని ముకుందన్‌కు పాన్ ఇండియా రేంజ్లో హీరోగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది.ఇటీవల ఈ సినిమాని చూసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ టీమ్‌ను అభినందించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.






