- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Thandel:వచ్చేసిన ‘బుజ్జితల్లి’ వీడియో సాంగ్.. కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న చైతు, సాయి పల్లవి
మ్యూజిక్ లవర్స్ (Music lovers)ను ఎంతగానో ఆకట్టుకుని సోషల్ మీడియా (Social media)లో ట్రెండింగ్ వన్‌గా నిలిచిన సాంగ్స్‌లో ‘బుజ్జితల్లి’ (BujjiThalli) ఒకటి.

దిశ, సినిమా: మ్యూజిక్ లవర్స్ (Music lovers)ను ఎంతగానో ఆకట్టుకుని సోషల్ మీడియా (Social media)లో ట్రెండింగ్ వన్‌గా నిలిచిన సాంగ్స్‌లో ‘బుజ్జితల్లి’ (BujjiThalli) ఒకటి. యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘తండేల్’ (Thandel). చందూ మొండేటి (Chandoo Mondeti) తెరకెక్కించిన ఈ చిత్రం నుంచి ‘సముద్రం సాక్షిగా.. ఒక యదార్థ ప్రేమకథ’ అనే క్యాప్షన్‌తో వచ్చిన ఫస్ట్ సింగిల్ ‘బుజ్జితల్లి’ సాంగ్ ఎలాంటి హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతో మంది సినీ, మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకునన ఈ సాంగ్‌కు సంబంధించి తాజాగా వీడియో (Video) రిలీజ్ చేశారు చిత్ర బృందం.
1 నిమిషం 45 సెకన్లు ఉన్న ఈ వీడియో సాంగ్‌లో నాగచైతన్య, సాయి పల్లవి మధ్య లవ్ ట్రాక్ (Love track), కెమిస్ట్రీ (Chemistry) ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రజెంట్ ‘బుజ్జితల్లి’ వీడియో సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ‘ఈ ఒక్క సాంగ్ చాలు.. సినిమా హిట్ అవ్వడానికి’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. కాగా.. లవ్ అండ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ‘తండేల్’ చిత్రం లవర్స్ డే స్పెషల్‌గా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.






