సుకుమార్ శిష్యుడు అనిపించుకున్న బుచ్చి.. అప్పటి న్యూస్ ఇప్పుడు వైరల్

by Pulgam srinivas |

సుకుమార్ ‘జగడం’ సినిమాతో ఎదుర్కొన్న విమర్శలు ఇప్పుడు బుచ్చిబాబుకి కూడా ఎదురవుతున్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

సుకుమార్ శిష్యుడు అనిపించుకున్న బుచ్చి.. అప్పటి న్యూస్ ఇప్పుడు వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: ‘ఉప్పెన’ సినిమాతో దర్శకుడిగా పరిచయమై, తాజాగా రామ్ చరణ్‌తో ‘పెద్ది’ సినిమాను తెరకెక్కించిన బుచ్చిబాబు సనా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు అనే విషయం తెలిసిందే. బుచ్చిబాబు తన గురువు సుకుమార్‌ను అనేక విషయాల్లో ఫాలో అవుతున్నారని పలు సందర్భాల్లో స్పష్టమైంది. సుకుమార్ తన కెరీర్ ప్రారంభ దశలో ఎదుర్కొన్న విమర్శల తరహానే, ఇప్పుడు బుచ్చిబాబు కూడా తన రెండవ సినిమాతో విమర్శలను ఎదుర్కొంటున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

సుకుమార్ తన మొదటి చిత్రం ‘ఆర్య’తో దర్శకుడిగా మంచి విజయాన్ని సాధించి ప్రత్యేక గుర్తింపు పొందారు. అయితే ఆ తర్వాత రామ్ పోతినేనితో చేసిన ‘జగడం’ సినిమాలో హీరోయిన్ పాత్రను బోల్డ్‌గా చూపించారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ పాత్రలోని కొన్ని సంభాషణలు, ప్రవర్తన ప్రేక్షకులను అసౌకర్యానికి గురి చేశాయని అప్పట్లో చర్చ జరిగింది. ‘ఆర్య’లాంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ఇలాంటి పాత్రను ఎందుకు రూపొందించారన్న విమర్శలు కూడా వినిపించాయి.

ఇక అదే తరహాలో బుచ్చిబాబు సనా తన రెండవ సినిమా ‘పెద్ది’లో జాన్వీ కపూర్ పాత్రను కూడా బోల్డ్‌గా చూపించారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ సినిమాలో ఆమె పాత్రపై సోషల్ మీడియాలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో బుచ్చిబాబు సనా స్పందిస్తూ క్షమాపణలు చెప్పడంతో పాటు, జాన్వీ కపూర్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను తొలగిస్తున్నట్లు తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో, సుకుమార్ తన రెండవ సినిమాతో హీరోయిన్ పాత్ర విషయంలో ఎదుర్కొన్న విమర్శలే ఇప్పుడు ఆయన శిష్యుడు బుచ్చిబాబుకి కూడా ఎదురయ్యాయని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Next Story