నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం రెడీ అయిన బుచ్చిబాబు

by Pulgam srinivas |   (  Updated:2026-05-01 10:56:48  IST  )

మహేష్ బాబుతో సినిమా చేయాలని బుచ్చిబాబు ప్రయత్నిస్తున్నట్లు ఓ వార్త వైరల్ అవుతోంది.

నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం రెడీ అయిన బుచ్చిబాబు
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత తక్కువ సమయంలో గొప్ప గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో బుచ్చిబాబు సనా ఒకరు. ఈయన స్టార్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర పనిచేసి ఆ తర్వాత ‘ఉప్పెన’ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించడంతో బుచ్చిబాబుకు దర్శకుడిగా మంచి గుర్తింపు వచ్చింది. ఈ మూవీ తర్వాత ఈ దర్శకుడు రామ్ చరణ్‌తో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. అందులో భాగంగా ఈయన రామ్ చరణ్ హీరోగా ‘పెద్ది’ సినిమాను రూపొందించారు. ఈ మూవీని మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నారు.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తైంది. దాంతో ఈ దర్శకుడు తన తదుపరి మూవీని ఎవరితో చేస్తాడా అనే ఆసక్తి జనాల్లో పెరిగింది. ప్రస్తుతం వస్తున్న కథనాల ప్రకారం బుచ్చిబాబు తన నెక్స్ట్ మూవీని మహేష్ బాబుతో చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది. ఆ లోపు ఒక కథను రెడీ చేసి మహేష్ బాబుకు వినిపించనున్నట్లు, అది ఓకే అయితే ఆయనతో ఈ దర్శకుడి తదుపరి సినిమా ఉండే అవకాశాలు ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతోంది.

ఇప్పుడు సినిమాలు తీసేవాళ్లు ఒళ్ళు బలిసి చేస్తున్నారు.. దుమారం రేపుతున్న రవిబాబు కామెంట్స్

Next Story