OG on Netflix : పవర్‌స్టార్ ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త.. ఓటీటీలోకి ‘ఓజీ’ ఎంట్రీ కన్ఫామ్

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-18 07:48:05  IST  )

బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తాజా బ్లాక్‌బస్టర్ ‘ఓజీ’ (OG) ఎట్టకేలకు ఓటీటీలోకి రాబోతోంది.

OG on Netflix : పవర్‌స్టార్ ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త.. ఓటీటీలోకి ‘ఓజీ’ ఎంట్రీ కన్ఫామ్
X

దిశ, వెబ్‌డెస్క్: బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తాజా బ్లాక్‌బస్టర్ ‘ఓజీ’ (OG) ఎట్టకేలకు ఓటీటీలోకి రాబోతోంది. ఈ మేరకు ఇవాళ నెట్‌ఫ్లిక్స్ (Netflix) అధికారికంగా ప్రకటించింది. ఈనెల 23 నుంచి తమ ప్లాట్‌ఫామ్‌లో ‘ఓజీ’ మూవీ స్ట్రీమ్ అవ్వనున్నట్లుగా వెల్లడించింది. యంగ్ డైనమిక్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కించిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్ డ్రామా ‘ఓజీ’ సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై తెలుగు సినిమా రికార్డులను కొల్లగొట్టింది. బాక్సాఫీస్ వద్ద వారాల వ్యవధిలోనే ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గ్రేస్, యాక్షన్ సిక్వెల్స్, వింటేజ్ లుక్స్‌తో పాటు డైరెక్టర్ సుజీత్ మేకింగ్ మూవీని టాప్ ఎండ్‌లో నిలబెట్టాయి. ఈ మూవీలో హీరోయిన్‌గా ప్రియాంక మోహన్, విలన్‌గా ఇమ్రాన్ హష్మీ, ప్రధాన పాత్రాల్లో శ్రీయా‌రెడ్డి, ప్రకాశ్‌రాజ్, అర్జున్ దాస్ నటించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించారు.

Next Story