అదీ.. ఇదీ.. అని తేడా లేకుండా.. అన్ని తెలుగు సినిమాల షూటింగ్స్‌కు బ్రేక్

by Gantepaka Srikanth |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో సమావేశం నేపథ్యంలో టాలీవుడ్(Tollywood) కీలక నిర్ణయం తీసుకుంది.

అదీ.. ఇదీ.. అని తేడా లేకుండా.. అన్ని తెలుగు సినిమాల షూటింగ్స్‌కు బ్రేక్
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో సమావేశం నేపథ్యంలో టాలీవుడ్(Tollywood) కీలక నిర్ణయం తీసుకుంది. రేపు అన్ని తెలుగు సినిమాల షూటింగ్స్(Telugu Movie Shootings), పోస్ట్ ప్రొడక్షన్ పనులకు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించారు. అంతేకాదు.. మంగళవారం తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సన్మానం చేయబోతున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఈ సన్మాన కార్యక్రమం జరుగనుంది. కాగా, సినీ పరిశ్రమకు పూర్తిగా సహకారం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ పరిశ్రమను నియంత్రించే పనులు ఎవరూ చేయొద్దని.. ఇది ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు. ఎవరైనా చట్ట పరిధిలో పనిచేయాల్సిందేనని ఇటీవల తనను కలిసిన నిర్మాతలు, దర్శకులకు స్పష్టం చేశారు. సినీ పరిశ్రమలో పని వాతావరణం బాగుండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

Next Story