‘దయచేసి కన్నప్ప సినిమాను ట్రోల్ చేయకండి’.. ఫ్యాన్స్‌కు బ్రహ్మానందం విజ్ఞప్తి

by Gantepaka Srikanth |

కన్నప్ప మూవీ(Kannappa Movie) ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో హాస్య నటుడు బ్రహ్మానందం(Brahmanandam) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘దయచేసి కన్నప్ప సినిమాను ట్రోల్ చేయకండి’.. ఫ్యాన్స్‌కు బ్రహ్మానందం విజ్ఞప్తి
X

దిశ, వెబ్‌డెస్క్: కన్నప్ప మూవీ(Kannappa Movie) ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో హాస్య నటుడు బ్రహ్మానందం(Brahmanandam) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కన్నప్ప సినిమాను శివతత్త్వం వ్యాప్తి చేయడానికి తీశారు. డబ్బు కోసం కాదు. అందరినీ ఒకేలా చూసే ఆ శివుడి గురించి ప్రపంచానికి చెప్పేందుకు మోహన్ బాబు, విష్ణు బాబు ఈ మూవీని ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీని ఎవ్వరూ అడ్డుకోకండి. ఇదొక గొప్ప చిత్రం అవుతుంది. కన్నప్ప ఒక చరిత్ర అవుతుంది. ఈ సినిమాను, ఈ పాత్రధారుల్ని ఆ శివుడే ఎంచుకున్నాడు. జూన్ 27న కన్నప్ప రాబోతోంది. భక్తితత్వంలోకి మన అందరినీ తీసుకు పోవాలనే ఆలోచన గొప్పది. ఈ భూమ్మీద ‘కన్నప్ప’ అనేది గొప్ప చిత్రం అవుతుంది. దయచేసి ఆదరించండి.. కానీ అల్లరిపాలు చేయకండి’ అని అభిమానులకు బ్రహ్మానందం విజ్ఞప్తి చేశారు. కాగా, కన్నప్ప మూవీ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రీతి ముకుందన్, మోహన్ బాబు, శరత్ కుమార్, మధు, ముఖేష్ రిషితో పాటు మోహన్‌లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు స్వయంగా మంచు విష్ణు కథ, స్క్రీన్‌ప్లే అందించారు.

Next Story