కోట శ్రీనివాసరావు మరణం.. బోరున ఏడ్చిన బ్రహ్మానందం

by Jakkula.Mamatha |   (  Updated:2025-07-13 03:31:51  IST  )

టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

కోట శ్రీనివాసరావు మరణం.. బోరున ఏడ్చిన బ్రహ్మానందం
X

దిశ,వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కోట మృతి పై సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణం గురించి తెలిసిన.. ప్రముఖ నటీనటులందరూ కోట ఇంటికి చేరుకుంటున్నారు

ఈ క్రమంలో కోట మరణవార్త తెలుసుకున్న బ్రహ్మానందం హుటహుటిన తన నివాసానికి బయలుదేరారు. ఈ నేపథ్యంలో కోట శ్రీనివాసరావు ఇంటికి చేరుకోగానే ఆయన మృతదేహం వద్దకు వెళ్లిన బోరున ఏడ్చారు. ఈ క్రమంలో కోట మృతదేహానికి నటుడు బ్రహ్మానందం నివాళులర్పించారు. ఈ సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కోట శ్రీనివాసరావు తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో పక్కనే ఉన్న నటుడు రాజేంద్రప్రసాద్.. బ్రహ్మానందాన్ని ఓదార్చారు. అనంతరం కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలిపారు. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం చాలా సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. అందులో "అహా! నా పెళ్ళంట!", "మాయలోడు", "త్రినేత్రుడు", "ధర్మక్షేత్రం", "బాలగోపాలుడు" మరియు "రాయుడు" ఇలా చాలా సినిమాల్లో వారిద్దరు కలిసి నటించారు.

Next Story