త్వరలో నన్ను అలాంటి రోల్‌లో చూస్తారు.. థియేటర్లు షేక్ అవుతాయంటూ బ్రహ్మానందం షాకింగ్ కామెంట్స్

by Chukka Sudharani |

హాస్య బ్రహ్మ పద్మశ్రీ అవార్డ్ గ్రహీత బ్రహ్మానందం(Brahmanandam), ఆయ‌న‌ కుమారుడు రాజా గౌతమ్(Raja Gautham) ప్రధాన పాత్రల్లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘బ్రహ్మా ఆనందం’(Brahma Anandam).

త్వరలో నన్ను అలాంటి రోల్‌లో చూస్తారు.. థియేటర్లు షేక్ అవుతాయంటూ బ్రహ్మానందం షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: హాస్య బ్రహ్మ పద్మశ్రీ అవార్డ్ గ్రహీత బ్రహ్మానందం(Brahmanandam), ఆయ‌న‌ కుమారుడు రాజా గౌతమ్(Raja Gautham) ప్రధాన పాత్రల్లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘బ్రహ్మా ఆనందం’(Brahma Anandam). సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల‌తో 100% స‌క్సెస్ రేటుని సాధించిన స్వధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై వస్తున్న ఈ నాలుగో చిత్రంలో ప్రియా వడ్లమాని (Priya Vadlamani), ఐశ్వర్య హోలక్కల్ (Aishwarya Holakkal) హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. డెబ్యూ డైరెక్టర్‌ ఆర్‌.వి.ఎస్‌.నిఖిల్ ద‌ర్శక‌త్వంలో రాహుల్ యాద‌వ్ న‌క్కా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతోంది.

ఇక రిలీజ్ సమయం దగ్గర పడటంతో వరుస అప్‌డేట్స్ ఇస్తున్నారు చిత్ర బృందం. ఇటీవల వచ్చిన టీజర్ ఫన్ అండ్ ఎమోషనల్‌గా నెట్టింట ప్రేక్షకులను ఆకట్టుకోగా.. సినిమాపై హైప్ క్రియేట్ అయింది. దీంతో ప్రమోషనల్ కంటెంట్‌తో కూడా మరింత క్రేజ్ క్రియేట్ చేస్తున్నారు చిత్ర బృందం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బ్రహ్మానందం.. తన నెక్ట్స్ సినిమాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు ‘త్వరలోనే నన్ను విలన్‌గా చూస్తారు... ఆ రోల్ ఎలా ఉంటుందంటే, దెబ్బకి థియేటర్ షేక్ అవుతుంది’ అని అన్నారు. ప్రజెంట్ ఈ కామెంట్స్ వైరల్ అవుతుండగా.. ఈ ఏజ్‌లో కూడా ఆ కాన్ఫిడెంట్ లెవల్ ఏంటీ సర్ అంటూ ఫిదా అవుతున్నారు నెటిజన్లు.

Next Story