- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మోహన్ బాబు కాళ్లు మొక్కిన బ్రహ్మానందం !
కన్నప్ప సినిమా ( Kannappa ) ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆసక్తికర సంఘటన జరిగింది. మంచు మోహన్ బాబు ( Manchu Mohan Babu)...

దిశ, వెబ్ డెస్క్ : కన్నప్ప సినిమా ( Kannappa ) ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆసక్తికర సంఘటన జరిగింది. మంచు మోహన్ బాబు ( Manchu Mohan Babu)... కాళ్ళను స్టేజ్ పైనే మొక్కారు కమెడియన్ బ్రహ్మానందం ( Bramhanandam). దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇవాళ.. మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా నిర్వహించారు.
ఈ సందర్భంగా డైలాగ్ కింగ్ మోహన్ బాబు అలాగే టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మానందం మధ్య ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తాను మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దని.. బ్రహ్మానందం అనగా... మోహన్ బాబు చేతులెత్తి దండం పెట్టేసారు. ఈ నేపథ్యంలోనే బ్రహ్మానందం ఇచ్చిన హావాభావాలకు ఫ్యాన్స్ కూడా సంబరపడిపోయారు.
డైలాగ్ చెప్పడంతో మోహన్ బాబు కింగ్ అంటూ బ్రహ్మానందం... ఆయనను ఇమిటేట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే... మంచు మోహన్ బాబు.. కాళ్లు పట్టుకున్నారు బ్రహ్మానందం. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీంతో సోషల్ మీడియాలో... రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్లో మోహన్ బాబు కాళ్లు మొక్కిన బ్రహ్మానందం pic.twitter.com/f6WsNnzlv6
— Telugu Scribe (@TeluguScribe) June 7, 2025






