Brahmamudi: అపర్ణా దేవి కోసం కావ్యను గదిలోకి రానిచ్చిన రాజ్

by Phanindra |

రాజ్ గదిలోకి కావ్య వెళ్లేసరికి బెడ్ మధ్యలో ఒక ప్లాస్టర్ వేస్తూ ఉంటాడు.

Brahmamudi: అపర్ణా దేవి కోసం కావ్యను గదిలోకి రానిచ్చిన రాజ్
X

దిశ, వెబ్ డెస్క్ : బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్

రాజ్ గదిలోకి కావ్య వెళ్లేసరికి బెడ్ మధ్యలో ఒక ప్లాస్టర్ వేస్తూ ఉంటాడు. అది చూసి కావ్య షాక్ అవుతుంది. రాజ్ దగ్గరుకు వెళ్ళి ఇది ఏంటండీ అని కావ్య అడుగుతుంది. దీన్ని గీత అని అంటారు. ‘ఏంటీ గీతా? ఎందుకింత రోత.. ఇది గీత కాదు నా తలరాత.. నా గుండె కోత’ అని బాధ పడుతూ కావ్య అంటుంది. ‘హలో హలో ఆపుతావా .. ఇది రాజ్ గీసిన రేఖ.. ఈ గీత దాటి నువ్వు నా వైపు రాకూడదు.. నేను కూడా అటు రాను.. కేవలం మా మమ్మీ చెప్పిందని .. నిన్ను నా రూమ్ లోకి రానిచ్చాను.. నేను మా మమ్మీ మాట కాదనలేను. ఆ సగం నీకు ఇది నాకు.. నా భాగంలోకి నువ్వు అసలు రాకు’ అనేసి దుప్పటి కప్పుకుని మంచిగా పడుకుంటాడు రాజ్.

కావ్య రాజ్ వైపు చూస్తూ రావద్దా? రావొద్దా అని అంటుంది. హేయ్ ‘రావద్దు’ అని రాజ్ అనేస్తాడు. ఆ మాట అనేసి రాజ్ కళ్లుమూసుకుని పడుకుంటాడు. ఇక కావ్య అలాగే చూస్తూ మంచం మీద పడుకుని ఉన్న రాజ్ ప్లేస్ లోకి వెళ్లిపోయి.. కావాలనే రాజ్ మీదకు వెళ్లి వాటర్ బాటిల్ అందుకోబోతుంది. వెంటనే, రాజ్ కళ్ళు తెరిచి చూస్తాడు. హేయ్..హేయ్.. ఏంటీ నా మీదకు రాకు రాకు అని అంటాడు. జరుగు జరుగు అని అంటూ ఉంటాడు. ‘మీ వాటాలో నా లోటా ఉంది’ అని కావ్య అంటుంది. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది.

Next Story