- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Malaika: మలైకా డేటింగ్ వార్తలపై స్పందించిన బాయ్ ఫ్రెండ్
మలైకా లేటెస్ట్ బాయ్ ఫ్రెండ్ హర్ష్, మలైకాతో చాలా క్లోజ్ గా ఉన్న వ్యక్తి తన క్లోజ్ ఫ్రెండ్ అని, అందుకే అంత సన్నిహితంగా ఉన్నారని, అంతకుమించి వారి మధ్యలో ఏమీ లేదని క్లారిటీ ఇచ్చాడు.

దిశ, వెబ్ డెస్క్: మలైకా అరోరా సినిమాల్లో అందాలను ఆరబోసి వార్తల్లో నిలవడమే కాకుండా తనకంటే చిన్న వాళ్లతో డేటింగ్ చేస్తూ కూడా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తుంది. ఈమె కొన్ని సంవత్సరాల క్రితం నటుడు 'అర్బాజ్ ఖాన్'ను వివాహం చేసుకుంది. కొంతకాలం వీరి సంసార జీవితం బాగానే సాగింది. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారు. ఈ హాట్ బ్యూటీ, అర్బాజ్ నుండి విడిపోయాక తనకంటే దాదాపు 12 ఏళ్లు చిన్నవాడైన 'అర్జున్ కపూర్'తో డేటింగ్ చేయడం మొదలుపెట్టింది.
చాలా సందర్భాలలో ఈ ఇద్దరు ప్రేమ పక్షులు ఒకే చోట కనిపించారు. దాంతో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కుతారేమో అని కూడా కొంతమంది భావించారు. అలాంటి సమయంలోనే ఐటెం బాంబు మలైకా, అర్జున్ కపూర్ ఇద్దరూ విడిపోయారు. అర్జున్ నుండి విడిపోయాక తన హృదయంలో ఈ హాట్ బ్యూటీ మరో వ్యక్తికి చోటు ఇచ్చింది. ఈసారి కూడా ఈమె ఏకంగా తనకంటే 19 ఏళ్ళు చిన్న వాడితో డేటింగ్ చేయడం మొదలుపెట్టింది. 52 ఏళ్ల ఈ హాట్ బ్యూటీ హర్ష్ మెహతాతో క్లోజ్ గా ఉంటుంది.
పార్టీలు, ఫంక్షన్లకు కలిసి తిరుగుతున్నారు, వాలెంటైన్స్ డే రోజు ఫారిన్లో వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇలా ఓవైపు 'హర్ష్'తో చాలా క్లోజ్ గా ఉంటున్న ఈ బ్యూటీ తాజాగా సోరబ్ బెడియాతో సన్నిహితంగా ఉన్న ఒక వీడియో బయటకు వచ్చింది. దాంతో మున్ని తన హృదయంలో మరో వ్యక్తికి చోటిస్తుందేమో అని కొంతమంది అభిప్రాయపడ్డారు. వెంటనే హర్ష్, మలైకాతో తను చాలా క్లోజ్ ఫ్రెండ్ అని, అందుకే అంత సన్నిహితంగా ఉన్నారని, అంతకుమించి వారి మధ్యలో ఏమీ లేదని క్లారిటీ ఇచ్చాడు. దీంతో మలైకా లేటెస్ట్ హాట్ మ్యాటర్ క్లోజ్ అయ్యింది.






