- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీ విష్ణుపై మండిపడుతున్న క్రైస్తవ మత సంఘాలు.. ఆయన ఏ తప్పు చేయలేదంటూ వెనకేసుకొస్తున్న ఫ్యాన్స్.. అసలు కథ అక్కడే స్టార్ట్...
సింగిల్’గా వచ్చి హిట్ కొట్టిన హీరో శ్రీ విష్ణును టార్గెట్ చేస్తున్నాయి క్రైస్తవ మత సంఘాలు. ఆయన ప్రతి సినిమాలో క్రిస్టియన్లపై సెటైర్స్ వేస్తున్నాడని.. ఆయన మూవీస్ బాయ్‌కాట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

దిశ, ఫీచర్స్ : ‘సింగిల్’గా వచ్చి హిట్ కొట్టిన హీరో శ్రీ విష్ణును టార్గెట్ చేస్తున్నాయి క్రైస్తవ మత సంఘాలు. ఆయన ప్రతి సినిమాలో క్రిస్టియన్లపై సెటైర్స్ వేస్తున్నాడని.. ఆయన మూవీస్ బాయ్‌కాట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జీసస్‌ను తన సినిమాల ద్వారా కించపరచడాన్ని తట్టుకోలేకపోతున్నామని ఫైర్ అయ్యారు. ఆయన మతంలో తప్పులు లేవా? వాటి గురించి ఎందుకు సినిమాలు తీయడు? అని ప్రశ్నిస్తున్నారు. బాయ్‌కాట్ శ్రీవిష్ణు మూవీస్ పేరుతో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. దీనిపై క్రిస్టియన్స్ మద్దతిస్తున్నారు. రాముడిపై ఇలాంటి జోక్స్ వేస్తే ఊరుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు.
అయితే అది శ్రీ విష్ణు తప్పు ఎలా అవుతుందని వార్‌కు దిగారు హీరో ఫ్యాన్స్. డైరెక్టర్ చెప్పినట్లు హీరో చేస్తాడు కానీ ఆయన సొంత కవిత్వం వాడరని ముందు తెలుసుకోవాలని ఫైర్ అవుతున్నారు. ఆ మాత్రం తెలియకుండా బాయ్ కాట్ ట్రెండ్ ఎలా క్రియేట్ చేస్తారని అడుగుతున్నారు. మొత్తానికి ఈ వార్ ఇలాగే జరుగుతున్నా.. సింగిల్ కలెక్షన్స్ మాత్రం జోరుగానే వస్తున్నట్లు తెలుస్తోంది. అటు సమంత ‘శుభం’ కూడా థియేటర్లలో రన్ అవుతోంది.






