- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Boyapati Srinu: నా ఊపిరున్నంత వరకు బాలయ్యతోనే సినిమాలు
తనకు ఊపిరి ఉన్నంత కాలం నందమూరి బాలయ్యతో సినిమాలు చేస్తానని సంచలన ప్రకటన చేశారు టాలీవుడ్ దర్శకుడు బోయపాటి శ్రీను.

దిశ, వెబ్ డెస్క్: తనకు ఊపిరి ఉన్నంత కాలం నందమూరి బాలయ్యతో సినిమాలు చేస్తానని సంచలన ప్రకటన చేశారు టాలీవుడ్ దర్శకుడు బోయపాటి శ్రీను. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న మరో మూవీ అఖండ 2. ఇప్పటికే అఖండ సినిమా రాగా, దానికి సీక్వెల్ గా ఇప్పుడు అఖండ 2 తీసుకువస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య హీరోగా చేస్తుండగా, ఆది పినిశెట్టి విలన్ గా కనిపించబోతున్నారట. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
డిసెంబర్ ఐదో తేదీన ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో తాజాగా జాజికాయ అంటూ సాగే పాట వీడియో రిలీజ్ చేశారు. దీనికోసం ప్రత్యేకంగా ఈవెంట్ నిర్వహించి సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా బోయపాటి శ్రీను ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఊపిరి ఉన్నంతవరకు నందమూరి బాలయ్యతో సినిమాలు చేస్తానని వెల్లడించారు. ఇక చాలు అని బాలయ్య అనే వరకు సినిమా చేస్తూనే ఉంటానన్నారు. ఈ సినిమాలో జాజికాయ ఒక్కటే, మాస్ సాంగ్ అని క్లారిటీ ఇచ్చారు. క్యాప్ లేపిన మీరే... చెయ్యి ఊపిన మీరే.. బాబు అంటూ బాలయ్యను బోయపాటి శ్రీను పొగిడారు. క్లిక్






