అఖండ 2 కోసం బోయపాటి క్రేజీ ప్లాన్.. ఇక ఇండస్ట్రీ షేక్ కావాల్సిందే !

by velandi.Saikiran |

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమాలంటే ఓ రేంజ్ లో మాస్ ఎ

అఖండ 2 కోసం బోయపాటి క్రేజీ ప్లాన్.. ఇక ఇండస్ట్రీ షేక్ కావాల్సిందే !
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమాలంటే ఓ రేంజ్ లో మాస్ ఎలివేషన్స్ ఉంటాయి. ముఖ్యంగా నందమూరి బాలయ్యను... ఊర మాస్ రేంజ్ లో కేవలం బోయపాటి శ్రీనివాస్ మాత్రమే చూపించగలరు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు బంపర్ విజయాన్ని నమోదు చేసుకుంది.

ఇప్పుడు అఖండ 2 సినిమా కూడా త్వరలో రాబోతుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఈ సినిమా ఉంది. ఇలాంటి నేపథ్యంలో అఖండ 2 సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ పెట్టాలని బోయపాటి శ్రీనివాస్ ప్లాన్ చేస్తున్నారట. బాలకృష్ణ నటిస్తున్న ప్రతి సినిమాలో స్పెషల్ సాంగ్ ఉంటుంది. అందుకే ఇప్పుడు నందమూరి బాలయ్య.. నటిస్తున్న అఖండ 2 సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నారట.

దీని కోసం ప్రత్యేకంగా ఒక హీరోయిన్ ను తీసుకుంటారని తెలుస్తోంది. ఈ మేరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ఓ హీరోయిన్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఆమె పేరు తెలియదు కానీ.. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే అధికారిక ప్రకటన చేసేందుకు సిద్ధమయ్యారట. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో సంయుక్త మీనన్ అలాగే, ప్రగ్యా జైస్వాల్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ గా నటించబోతున్నట్లు సమాచారం.

Next Story