- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నటి త్రిష ఇంటికి మరోసారి బాంబు బెదిరింపులు
ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ నగరాల్లో బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా పాఠశాలలు, ప్రముఖ కట్టడాలు, సెలబ్రేటీల ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దుండగులు బెదిరింపులకు పాల్పడుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ నగరాల్లో బాంబు బెదిరింపులు (Bomb threats) ఎక్కువయ్యాయి. ముఖ్యంగా పాఠశాలలు, ప్రముఖ కట్టడాలు, సెలబ్రేటీల ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దుండగులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడులోని చెన్నై నగరంలో ప్రముఖుల ఇళ్లకు వరుసగా బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా ప్రముఖ నటి త్రిష (Actress Trisha) నివాసానికి మరోసారి బెదిరింపు వచ్చాయి. చెన్నై ఆళ్వార్‌పేట్‌లో ఆమె నివాసంలో బాంబ్ ఉన్నట్టు అనామక ఈమెయిల్ ద్వారా సమాచారం వచ్చింది.
ఈ సమాచారం అందగానే పోలీసులు, డాగ్ స్క్వాడ్, బాంబ్ డిఫ్యూజల్ టీమ్ అక్కడికి చేరుకొని తనిఖీలు చేశారు. సుమారు రెండు గంటల పాటు సాగిన పరిశీలన అనంతరం ఎటువంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు కనుగొనబడలేదు. ఈ నేపథ్యంలో ఇది బూటకపు బెదిరింపు అని అధికారులు తెలిపారు. కాగా ఇది త్రిష నివాసానికి వచ్చిన నాలుగో బాంబ్ బెదిరింపు. పోలీసులు సైబర్ ట్రాకింగ్, భద్రతా చర్యలను మరింత బలపరిచారు. ప్రజల్లో భయాందోళనలకు తావు లేకుండా అదనపు రక్షణ ఏర్పాట్లు చేశారు.






