- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ramayana: అలాంటి గాసిప్స్ పట్టించుకోవద్దు.. బాలీవుడ్ రామాయణంపై బిగ్ అప్డేట్ ఇచ్చిన టీమ్
నమిత్ మల్హోత్రా ఎంతో ప్రతిష్టాత్మంగా నిర్మిస్తున్న మూవీ ‘రామాయణం’.

దిశ, సినిమా: నమిత్ మల్హోత్రా ఎంతో ప్రతిష్టాత్మంగా నిర్మిస్తున్న మూవీ ‘రామాయణం’. ఈ సినిమా అఫీషియల్‌గా అనౌన్స్ చేయకముందు నుంచే దీనికి సంబంధించి అనేక వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. అలాగే.. రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయిపల్లవికి సంబంధించిన ఫొటోలు సైతం సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఇక ఇటీవల ‘రామాయణం’పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ రిలీజ్ చేసిన గ్లింప్స్‌కు విశేష స్పందన లభించింది. దీంతో ఈ సినిమా నుంచి వచ్చే అప్డేట్స్ కోసం బాలీవుడ్ ఆడియన్స్‌తో పాటు సినీ లవర్స్ అందరూ కూడా ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ మూవీపై అనేక వార్తలు ఎప్పటికప్పుడు నెట్టింట దర్శనమిస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగా తాజాగా ఓ అనౌన్స్‌మెంట్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మేరకు ‘మీరు మాపై చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు.. మీకు ‘రామాయణం’ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ అయినా అఫీషియల్ అకౌంట్ @worldoframayana నుంచి మాత్రమే వస్తాయి. కొన్ని అనాధికార సైట్స్ నుంచి వచ్చే అప్డేట్స్ మీరు నమ్మోద్దు. అలాంటి గాసిప్స్‌ను పట్టించుకోకండి’ అంటూ తెలిపారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతుంది.
కాగా.. బాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ‘రామాయణం’ చిత్రానికి నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్‌తో పాటు హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే తదితరులు నటిస్తున్నారు. నమిత్ మల్హోత్రాతో కలిసి రాకింగ్ స్టార్ యశ్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఈ సినిమా రెండు పార్ట్స్‌గా రాబోతుండగా.. 2026లో మొదటి భాగం, 2027లో రెండవ భాగాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రావాల్సి ఉంది. లింక్






