- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లగ్జరీ అపార్ట్‌మెంట్ అమ్మేసిన స్టార్ హీరో ?
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ.. కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు (Salman Khan) ఉన్న క్రేజ్ అంతా

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ.. కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు (Salman Khan) ఉన్న క్రేజ్ అంతా కాదు. ఎన్నో సంవత్సరాలుగా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ మంచి సక్సెస్ అందుకున్నాడు. పెళ్లి చేసుకోనప్పటికీ.. ప్రేక్షకులను మాత్రం బాగా ఎంటర్టైన్ చేశాడు. అదే సమయంలో తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో కనిపించి మెరిశాడు.
అయితే అలాంటి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం కష్టాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా తన లగ్జరీ అపాయింట్మెంట్ ను అమ్మేసినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఉన్న ఖరీదైన ఫ్లాట్ అమ్మేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ అపార్ట్మెంట్ 1318 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుందట. అంటే సులభంగా మూడు కార్లు పార్కింగ్ చేసుకునే అంత స్పేస్ ఉంటుందట.
ఈ అపార్ట్మెంట్ ను 5.35 కోట్లకు విక్రయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫ్లాట్ ఎందుకు అమ్మాల్సి వచ్చింది అనే దానిపైన.. క్లారిటీ లేదు. అతనికి అర్జెంటుగా డబ్బులు అవసరం ఉన్న నేపథ్యంలోనే ఈ పని చేసినట్లు చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా 59 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా.. సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోలేదన్న సంగతి తెలిసిందే. పలువురు బాలీవుడ్ హీరోయిన్స్ తో మాత్రం అప్పట్లో రిలేషన్ పెట్టుకున్నాడు.






