- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Allu Arjun: అల్లు అర్జున్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. జోడీ అస్సలు బాగోదంటున్న నెటిజన్లు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ఇటీవల ‘పుష్ప-2’ (pushpa-2) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ఇటీవల ‘పుష్ప-2’ (pushpa-2) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ‘పుష్ప’కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపించి అందరికి లాభాలు తెచ్చిపెట్టింది. అలాగే కొన్ని విమర్శలు కూడా తీసుకొచ్చింది. ఇక ‘పుష్ప-2’ తెచ్చిన వివాదాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో ఓ సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో భారీ ప్రాజెక్ట్‌పై నెట్టింట వార్తల వైరల్ అవుతున్నాయి.
తమిళ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్న యంగ్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి అయినట్లు తెలుస్తుండగా.. అల్లుఅట్లీ ప్రాజెక్ట్ దాదాపు కన్ఫార్మ్ అయినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో నటించే హీరోయిన్ గురించి ప్రజెంట్ ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హీరోయిన్‌గా ఫిక్స్ చేసే ప్రయత్నంలో ఉన్నారట మేకర్స్. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వార్తులు నెట్టింట వార్తలు వైరల్ కావడంతో అల్లు అర్జున్, ప్రియాంక చోప్రా జోడీ అస్సలు సెట్ అవ్వదు అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తు్న్నారు నెటిజన్లు. కాగా.. ఈ మూవీ భారతదేశంలోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతుందని కూడా నివేదికలు సూచిస్తున్నాయి. అంతే కాకుండా దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తున్నాయి.






