రజినీకాంత్ కాళ్లు మొక్కిన బాలీవుడ్ స్టార్ హీరో

by Gantepaka Srikanth |

రజినీకాంత్ కాళ్లు మొక్కిన బాలీవుడ్ స్టార్ హీరో

రజినీకాంత్ కాళ్లు మొక్కిన బాలీవుడ్ స్టార్ హీరో
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన కూలీ మూవీ(Coolie Movie) నుంచి ఇవాళ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో తమిళనాడులోని చెన్నై వేదికగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్నది. బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్(Aamir Khan) అందరినీ ఆకట్టుకున్నాడు. ఫంక్షన్‌కు ఎంటర్ అవ్వగానే వచ్చి రజినీకాంత్ కాంత్ కాళ్లు పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, కూలీ సినిమాలో అమిర్ ఖాన్ గెస్ట్ రోల్ చేశారు. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌‌లో నాగార్జున, ఉపేంద్ర, శ్రుతిహాసన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story