- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
SSMB29లో విలన్‌గా బాలీవుడ్ స్టార్ హీరో!
సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో SSMB29 వస్తున్న సంగతి తెలిసిందే.

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో SSMB29 వస్తున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ (Hollywood) రేంజ్‌లో ఈ చిత్రం ఉండబోతుందని ఇప్పటికే రాజమౌళి హింట్ ఇవ్వగా.. సినిమా ఎలా ఉండబోతుందా అని మహేశ్ బాబు ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో కూడా క్యూరియాసిటీ పెరిగిపోయింది. అంతే కాకుండా.. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా కంప్లీట్ కాగా.. తాజాగా రాజమౌళి మహేశ్ బాబుని షూటింగ్ కోసం లాక్ చేసినట్లు హింట్ ఇచ్చాడు. దీంతో ప్రిన్స్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
SSMB29 కి సంబంధించి నటీనటుల గురించి ఇంకా చిత్ర బృందం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వలేదు. కానీ హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా (Priyanka Chopra)ను ఫిక్స్ చేసినట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ మూవీలో విలన్‌గా మలయాళ (Malayalam) స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) నటిస్తు్న్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అతడి స్థానంలో బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో జాన్ అబ్రహం (John Abraham) పేరు వినిపిస్తోంది. షారుఖ్ ఖాన్ కంబ్యాక్ మూవీ ‘పఠాన్’ లో అద్భుతమైన విలనిజాన్ని పండించి పాపులర్ యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు జాన్ అబ్రహం. ‘పఠాన్’ సినిమాతో యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జాన్ అబ్రహం ఇప్పుడు SSMB29 లో జాయిన్ అవుతున్నాడు అనే వార్త ప్రజెంట్ నెట్టింట హాట్ హాట్‌గా వైరల్ అవుతోంది. అయితే.. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.






