- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ బ్యూటీ క్రేజీ పోస్ట్.. 6 వ ఫొటో ఊహించనిదంటూ నెటిజన్లు షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే (Ananya Panday) లైగర్ (Liger) సినిమాతో టాలీవుడ్ సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే (Ananya Panday) లైగర్ (Liger) సినిమాతో టాలీవుడ్ సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)సరసన నటించి.. ఈ బ్యూటీ మంచి మార్కులే కొట్టేసింది. కానీ ఈ మూవీ ప్రేక్షకల్ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. తర్వాత ఈ బ్యూటీ రాకీ ఔర్ రాణి (Rocky Aur Rani Kii Prem Kahani), స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ (Student of the Year), పతి పత్నీ ఔర్ వో, ఖాలీ పీలీ, గెహ్లెయాన్, డ్రీమ్ గర్ల్ 2, ఖో గయే హమ్ కహాన్(Kho Gaye Hum Kahaan), బాడ్ న్యూజ్ (Bad news), ఖేల్ ఖేల్ మే (Khel Khel May), సీటీఆర్ఎల్ వంటి తెలుగు, హిందీ చిత్రాల్లో నటించి జనాల మెప్పు పొందింది.
అనన్య పాండే బాలీవుడ్లో నటించిన "కంట్రోల్" (Control) అనే సైబర్ థ్రిల్లర్ సినిమా తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయిన విషయం తెలిసిందే. సైబర్ త్రిల్లర్గా డిఫరెంట్ పాయింట్తో తెరకెక్కించిన ఈ మూవీ ఏకంగా సినిమా నాలుగు భాషల్లో విడుదల చేశారు. నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేశారు మేకర్స్. మొదటి ట్రైలరే ఈ మూవీపై జనాల్లో భారీ హైప్ పెంచిందని చెప్పుకోవచ్చు.
ఫ్యూచర్లో ఏఐ టెక్నాలజీ.. సోషల్ మీడియా.. మనుషుల్ని ఏ లెవల్లో ప్రభావితం చేస్తుందో.. దీన్ని ఎలా కంట్రోల్ పెట్టాలనే స్టోరీనే దర్శకుడు విక్రమాదిత్య ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇందులో అనన్య పాండేతో పాటుగా విమాన్ సామ్రాట్ కీలక పాత్రలో నటించాడు. ఇదంతా పక్కన పెడితే.. అనన్య పాండే ఓ వైపు సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం తరచూ యాక్టివ్ గానే కనిపిస్తుంటుంది.
తరచూ నెట్టింట ఏదో ఒక పోస్ట్ పెడుతూ అభిమానుల్ని అలరిస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ పోస్ట్ పంచుకుంది. ఇందులో పలు ఫొటోలు ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది. ఈ పిక్స్ వీక్షించిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ముఖ్యంగా ఆరో పిక్ మాత్రం ఊహించనిది అంటూ క్రేజీ కామెంట్లతో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






