- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RC-17 కోసం హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ.. ట్వీట్ వైరల్
ప్రస్తుతం రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాతో బిజీగా ఉన్నాడు.

దిశ, సినిమా: ప్రస్తుతం రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే చెర్రి.. సుకుమార్ డైరెక్షన్‌లో మరో చిత్రం అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. RC 17 అనే వర్కింగ్ టైటిల్‌తో స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటోన్న ఈ మూవీకి సంబంధించి ఆసక్తికర అప్డేట్ ఒకటి నెట్టింట చర్కర్లు కొడుతోంది. RC 17పై అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచి ఇందులో నటించే హీరోయిన్‌పై అనేక వార్తలు వస్తుండగా.. తాజాగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ పేరు వినిపిస్తుంది. RC 17లో ఫిమేల్ లీడ్ కోసం కృతి సనన్‌ను సంప్రదించారట మేకర్స్.
ఇప్పటికే చర్చలు జరపగా ఆల్మోస్ట్ ఈ బ్యూటీ కన్ఫర్మ్ అయినట్లు బాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. అయితే.. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. కాగా.. ఈ మూవీకి సంబంధించి ప్రజెంట్ స్క్రిప్ట్ వర్క్‌తో పాటు ప్రీ విజువలైజేషన్ పనులను కూడా పర్యవేక్షిస్తున్నారట సుకుమార్. ఇక రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ వచ్చే ఏడాది మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుండగా.. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తన ఫోకస్ RC 17పై పెట్టనున్నట్లు టాక్. లింక్






