- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అల్లు అర్జున్-అట్లీ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఫిక్స్..వామ్మో ఐరన్ లెగ్ అస్సలు వద్దు అంటున్న నెటిజన్లు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ఇటీవల ‘పుష్ప-2’ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ఇటీవల ‘పుష్ప-2’ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ మూవీ విడుదల తర్వాత భారీ కలెక్షన్లు రాబట్టి పలు రికార్డులు క్రియేట్ చేసింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఐకాన్ స్టార్ ఓ పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ అట్లీ(Atlee) దర్శకత్వం వహిస్తున్నారు. అయితే భారీ అంచనాల మధ్య రాబోతుండగా.. దీనిని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ హైలీ యాంటిసిపేటెడ్ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలై హైప్ పెంచేశాయి. దీంతో ఇందులో ఐకాన్ స్టార్ సరసన ఎవరు నటిస్తున్నారనే? ఆసక్తి పెరిగింది.
ఇక అప్పటి నుంచి ఈ మూవీకి సంబంధించి పలు వార్తలు వస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నాయి. అయితే ఇటీవల ఇందులో అల్లు అర్జున్ సినిమాలో మృణాల్(Mrunal Thakur), జాన్వీ కపూర్, దీపికా పదుకొణె(Deepika Padukone) నటిస్తున్నట్లు పలు పోస్టులు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ బాలీవుడ్ యంగ్ బ్యూటీ అల్లు అర్జున్ మూవీలో నటిస్తున్నట్లు పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఆమె ఎవరో కాదు అనన్య పాండే(Ananya Pandey). ఈ అమ్మడు ఐకాన్ స్టార్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు పలు ట్వీట్ చక్కర్లు కొడుతున్నాయి.
ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ .. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు వామ్మో ఆమెది ఐరన్ లెగ్ అస్సలు వద్దు అని అంటున్నారు. అలాగే సినిమా కచ్చితంగా ఫ్లాప్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. కాగా.. ఈ భామ ‘లైగర్’ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన నటించింది. అయితే ఈ సినిమా భారీ డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ తెలుగు చిత్రంలో కనిపించలేదు. బాలీవుడ్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టి అక్కడే వరుస ప్రాజెక్ట్స్ చేస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ వరుస పోస్టులు షేర్ చేస్తోంది.






