Sharvari Wagh: సూపర్ హిట్ ఫ్రాంచైజీలోకి చాన్స్ అందుకున్న యంగ్ హీరోయిన్.. ఇలాంటి చాన్స్ రావడం అదృష్టం అంటున్న నెటిజన్లు.

by sudharani |
Sharvari Wagh: సూపర్ హిట్ ఫ్రాంచైజీలోకి చాన్స్ అందుకున్న యంగ్ హీరోయిన్.. ఇలాంటి చాన్స్ రావడం అదృష్టం అంటున్న నెటిజన్లు.
X

దిశ, సినిమా: బాలీవుడ్ (Bollywood) నటి శార్వారి వాఘ్ (Sharvari Wagh) అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత 2020లో ‘ది ఫర్గాటెన్ ఆర్మీ- ఆజాదీ కే లియే’ అనే వెబ్ సిరీస్‌తో నటన రంగంలోకి అగుగుపెట్టిన ఈ బ్యూటీ.. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో 2021లో ‘‘బంటీ ఔర్ బబ్లీ 2’ సినీ రంగ ప్రవేశం చేసి.. తన అందం, యాక్టింగ్‌తో అభిమానులను ఆకట్టుకుంది. తర్వాత ‘ముంజ్య’ (Munjya), ‘మహారాజా’ (Maharaja) వంటి చిత్రాలతో ఫుల్ క్రేజ్‌లోకి వచ్చిన ఈ బ్యూటీ.. ప్రజెంట్ వరుస అవకాశాలు అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన మూడవ ప్రధాన చిత్రంగా ఓ హిట్ సినిమా ఫ్రాంచైజీలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ సరసన నటించే అవకాశం పొందినట్లు తెలుస్తోంది.

స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh), డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ (Farhan Akhtar) హిట్ ఫ్రాంచైజీగా రాబోతున్న మూడొవ భాగం ‘డాన్ 3’ (Don 3). ఈ మూవీ అనౌన్స్ చేసి చాలా కాలం అవుతున్నప్పటికీ షూటింగ్ వాయిదా పడుతూనే ఉంది. కానీ, ఈ చిత్రానికి సంబంధించిన వార్తలు మాత్రం ఏదో ఒకటి వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ఈ హిట్ ఫ్రాంచైజీలో హీరోయిన్‌గా మొన్నటి వరకు కియారా అద్వానీ (Kiara Advani) పేరు వినిపించగా.. ఇప్పుడు శార్వారి వాఘ్ తెరపైకి వచ్చింది. ఇందులో రణ్‌వీర్‌కు జోడీగా శార్వారిని ఫిక్స్ చేసినట్లు బాలీవుడ్ వర్గాల నుంచి. త్వరలో దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్‌లోని అత్యంత ప్రసిద్ధ ఫ్రాంచైజీలలో ఒకటైనా ఈ చిత్రంలో శార్వారికి చాన్స్ రావడం గొప్ప అవకాశం అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. కాగా.. ‘డాన్-3’ చిత్రం షూటింగ్ 2025 చివరి నాటికి స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed