sexually harassed: అతడు నన్ను చూసి హస్తప్రయోగం చేసుకున్నాడు.. ఆ టైమ్‌లో నేను వణికిపోయాను.. నటి షాకింగ్ కామెంట్స్

by Chukka Sudharani |   (  Updated:2025-06-08 11:43:53  IST  )

బాలీవుడ్‌(Bollywood)కు చెందిన జెమీ లివర్ (Jamie Lever) టీవీ షోస్‌తో పాపులారిటీ తెచ్చుకుని.. 2015లో ‘కిస్ కిస్కో ప్యార్ కరూన్’ చిత్రంతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

sexually harassed: అతడు నన్ను చూసి హస్తప్రయోగం చేసుకున్నాడు.. ఆ టైమ్‌లో నేను వణికిపోయాను.. నటి షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్‌(Bollywood)కు చెందిన జెమీ లివర్ (Jamie Lever) టీవీ షోస్‌తో పాపులారిటీ తెచ్చుకుని.. 2015లో ‘కిస్ కిస్కో ప్యార్ కరూన్’ చిత్రంతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. హిందీలో పలు చిత్రాలు చేసిన ఈమె.. 2024లో అల్లరి నరేష్ (Allari Naresh) హీరోగా నటించిన ‘ఆ ఒక్కటి అడక్కు’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది. ప్రస్తుతం పలు సినిమాలు చేస్తున్న ఈమె.. రీసెంట్‌గా ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను చిన్న తనంలో ఎదుర్కొన్న షాకింగ్ ఇన్స్‌డెంట్ గురించి చెప్పుకొచ్చింది.

‘ఒకసారి నేను, నా ఫ్రెండ్ నా బ్రదర్ వచ్చే వరకు కారులో వేచి ఉన్నాము. మేము ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా.. ఓ వ్యక్తి వచ్చి నా ఎదురుగా నిలబడి హస్తప్రయోగం చేయడం స్టార్ట్ చేశాడు. నేను మొదటిసారి పురుష భాగాన్ని చూశాను.. అప్పుడు నేను చాలా చిన్నదాన్ని.. అతను ఏమి చేస్తున్నాడో నాకు తెలియదు. నేను వెంటనే నా స్నేహితుడికి ‘నీ వెనుక ఒక అపరిచితుడు ఉన్నాడు.. అతను ఏమి చేస్తున్నాడో నాకు తెలియదు’ అని చెప్పాను. నా స్నేహితుడు చూసి.. నువ్వు అతన్ని పట్టించుకోకుండా మాట్లాడటం కొనసాగించమని సూచించాడు. ఆ టైమ్‌లో నేను చాలా భయపడ్డాను.. వణికిపోయాను. నేను నెమ్మదిగా కదిలి కారు లాక్ చేశాను. కొంత సమయం తర్వాత.. మేము అతని వైపు దృష్టి పెట్టడం లేదని అతను గ్రహించి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు నాకు 10 లేదా 12 సంవత్సరాలు ఉంటాయి’ అని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ జెమీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story