Barkha Singh: ఇమెయిల్ ద్వారా కమిట్మెంట్ ప్రపోజల్.. వింత అనుభవాన్ని బయట పెట్టిన రీసెంట్ బ్లాక్ బస్టర్ హీరోయిన్

by Chukka Sudharani |   (  Updated:2025-06-28 16:37:36  IST  )

ఇండస్ట్రీలో జరిగే కాస్టింగ్ కౌచ్‌పై ఇప్పటికే చాలా మంది బహిరంగంగా తెలిపిన విషయం తెలిసిందే.

Barkha Singh: ఇమెయిల్ ద్వారా కమిట్మెంట్ ప్రపోజల్.. వింత అనుభవాన్ని బయట పెట్టిన రీసెంట్ బ్లాక్ బస్టర్ హీరోయిన్
X

దిశ, సినిమా: ఇండస్ట్రీలో జరిగే కాస్టింగ్ కౌచ్‌పై ఇప్పటికే చాలా మంది బహిరంగంగా తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా ఈ లిస్ట్‌లో నేను కూడా ఉన్నానంటూ చెప్పుకొచ్చింది బాలీవుడ్ నటి బర్ఖా సింగ్. బాల నటీగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తర్వాత పలు టీవీ షోలతో, వెబ్ సీరిస్, సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ అమ్మడు ‘క్రిమినల్ జస్టిస్ 4’తో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. తన నటనకు ప్రశంసలు అందుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బర్ఖా.. కాస్టింగ్ కౌచ్‌పై తన ఎక్స్‌పీరియన్స్‌ను తెలిపింది.

‘సౌత్ ఇండస్ట్రీ నుంచి నాకు చేదు అనుభవం ఎదురైంది. ఓ సినిమా ఆఫర్ కోసం వెళ్లినప్పుడు.. నాకు అక్కడ నుంచి ఓ ఇమెయిల్ వచ్చింది. అది ఎవరు పంపించారో నాకు తెలియదు. అందులో.. ‘షూటింగ్ ఇన్ని రోజులు ఉంటుంది.. మీరు కనీసం 36 రోజులు వర్క్ చేయాలి.. అలాగే కమిట్మెంట్ ఇవ్వాలి’ అని రాసి ఉంది. ఆ వ్యక్తి పంపించిన దాంట్లో నేను ఎవరికి కమిట్మెంట్ ఇవ్వాలి అనే పేరు మాత్రం చెప్పలేదు. ఇండస్ట్రీలో ఇలాంటి జరుగుతాయని నాకు తెలుసు. అందుకే నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. అలాంటి పరిస్థితి రాకుండా కష్టపడేందుకు ప్రయత్నిస్తాను. కానీ రాత పూర్వకంగా రావడం మాత్రం నాకు షాకింగ్‌గా అనిపించింది’ అని తెలిపింది.

Next Story