- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘అఖండ-2’ సినిమాలో బాలీవుడ్ నటుడు కామియో రోల్.. అంచనాలను పెంచుతున్న ట్వీట్
నందమూరి బాలకృష్ణ(Balakrishna) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘అఖండ-2’ (Akhanda-2) .

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ(Balakrishna) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘అఖండ-2’ (Akhanda-2). బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా సూపర్ హిట్ ‘అఖండ’కు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. అయితే ఇందులో సంయుక్త మీనన్(Samyuktha Menon), ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్స్‌లోకి రాబోతుంది. ఇక ఇప్పటికే విడుదలై అప్డేట్స్ అన్ని ‘అఖండ-2’ చిత్రంపై భారీ అంచనాలను పెంచేశాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ మూవీలో బాలీవుడ్ నటుడు, హీరో సన్నీ డియోల్(Sunny Deol) కామియో రోల్‌లో నటించబోతున్నట్లు టాక్. ఇక ఇటీవల ఆయన హీరోగా నటించిన చిత్రం ‘జాట్’ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు బాలయ్య సినిమాలో గెస్ట్‌గా నటిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇక కొంతమంది మాత్రం హిట్ కొట్టడం ఖాయమని అంటున్నారు.
BREAKING: #Jaat Hero #SunnyDeol Making CAMEO in #Akhanda2 which leads to Third PART #Akhanda3 💥💥💥
— OTT STREAM UPDATES (@newottupdates) April 27, 2025
Releasing WORLDWIDE From SANKRANTI 2026 🔥🔥🔥 #NandamuriBalakrishna | #ThamanS | #PragyaJaiswal | #BoyapatiSrinu 😎✌🏼⭐ pic.twitter.com/fIQShqV0g2






