- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘జాట్’ సినిమాలో పవర్ ఫుల్ లుక్‌లో బాలీవుడ్ నటుడు.. గ్లింప్స్ విడుదలకు టైమ్ ఫిక్స్
టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని(Gopichand Malineni), బాలీవుడ్ సూపర్ స్టార్ సన్నీ డియోల్(Sunny Deol) కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘జాట్’.

దిశ, సినిమా: టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని(Gopichand Malineni), బాలీవుడ్ సూపర్ స్టార్ సన్నీ డియోల్(Sunny Deol) కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘జాట్’. పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్‌డ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని(Naveen Yerneni), వై రవిశంకర్(Ravi Shankar) నిర్మిస్తున్నారు. అయితే పలు హిట్ మూవీస్ తెరకెక్కించిన దర్శకుడు రూపొందిస్తుండటంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ చిత్రానికి ఎస్ తమన్(Thaman) బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తుండగా.. ఇందులో వినీత్ కుమార్ సింగ్, సయామి ఖేర్, రెజీనా కసాండ్రా కీలక పాత్రలో కనిపించనున్నారు.
షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ మూవీ ఏప్రిల్ 10న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇక ఇప్పటికే ‘జాట్’ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ అందరిలో క్యూరియాసిటీని పెంచాయి. తాజాగా, ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా(Randeep Hooda) ఇందులో పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంతేకాకుండా క్యారెక్టర్‌కు సంబంధించిన గ్లింప్స్ మార్చి 10వ తేదీన ఉదయం 10:30 గంటలకు రాబోతున్నట్లు వెల్లడించారు. అలాగే ఓ పోస్టర్‌ను షేర్ చేస్తూ ‘‘చెడుకు కొత్త ముఖం వచ్చింది’’ అనే క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ అందరిలో ఆసక్తిని పెంచుతోంది.
The nemesis of #JAAT ❤🔥
— BA Raju's Team (@baraju_SuperHit) March 9, 2025
Introducing the brilliant @RandeepHooda in a powerful role.
Character Glimpse on 10th March at 10.35 AM 💥💥#JAAT GRAND RELEASE WORLDWIDE ON APRIL 10th.#BaisakhiWithJaat pic.twitter.com/DndAlOwGg9






