టాక్సిక్ నుంచి బోల్డ్ పోస్టర్ రిలీజ్.. వామ్మో సినిమా రిలీజ్‌కు ముందే హీటెక్కిస్తున్నారుగా

by Gugulothu.Kavitha |

రాకింగ్ స్టార్ యశ్(Rocking Star Yash) హీరోగా, గీతూ మోహన్ దాస్(Geethu Mohan Das) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’.

టాక్సిక్ నుంచి బోల్డ్ పోస్టర్ రిలీజ్.. వామ్మో సినిమా రిలీజ్‌కు ముందే హీటెక్కిస్తున్నారుగా
X

దిశ, వెబ్‌డెస్క్: రాకింగ్ స్టార్ యశ్(Rocking Star Yash) హీరోగా, గీతూ మోహన్ దాస్(Geethu Mohan Das) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో యష్‌కు జోడిగా కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార, తారా సుతారియా, రుక్మిణి వసంత్, అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్ వంటి వారు కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రం 2026 మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి కౌంట్ డౌన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. టాక్సిక్ మూవీ థియేటర్లలో రావడానికి ఇంకా 38 రోజులు మాత్రమే ఉంది’ అని రాసుకొస్తూ బోల్డ్ పోస్టర్ షేర్ చేశారు. రాయ పాత్రను రివీల్ చేసిన టైమ్‌లో కారులో ఓ లేడీతో హీరో శృంగారం చేసిన సంగతి తెలిసిందే.

ఆ లేడీనే హీరో మెడ దగ్గర ఎంతో మత్తుగా కిస్ చేస్తున్న ఫొటోను షేర్ చేశారు. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు సినిమా రిలీజ్ కాకముందే ఇలాంటి ఫొటోస్, టీజర్‌తో హీటెక్కిస్తున్నారుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో క్రేజీ బ్యూటీ రుక్మిణి వసంత్ ఫస్ట్ మెల్లిసాగా, నదియా పాత్రలో కియారా, ఎలిజబెత్‌గా హ్యుమా ఖురేషీ, గంగ పాత్రలో నయనతార నటించనున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే.

Next Story