వైట్ శారీలో బోల్డ్ బ్యూటీ.. బ్యూటిఫుల్ అంటూ నెటిజన్స్ కామెంట్స్

by I. Sairam |   (  Updated:2025-05-19 02:45:53  IST  )

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటించిన ‘లైగర్’(Liger) మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ అనన్య పాండే(Ananya Pandey) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

వైట్ శారీలో బోల్డ్ బ్యూటీ.. బ్యూటిఫుల్ అంటూ నెటిజన్స్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటించిన ‘లైగర్’(Liger) మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ అనన్య పాండే(Ananya Pandey) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ చిత్రం అనుకున్నంతగా విజయం సాధించలేదు. దీంతో టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసి బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ అడపా దడపా సినిమాలు చేస్తూ హీరోయిన్‌గా రాణిస్తోంది. రీసెంట్‌గా ‘కేసరి-2’(Kesari-2) సినిమాతో మనముందుకు వచ్చి మంచి విజయం సాధించింది. ఇక స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar), ఆర్ మాధవన్(R.Madhavan) ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం మే23న తెలుగులో రిలీజ్ కానుంది.

అయితే ఓ పక్కా సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ నిత్యం సోషల్ మీడియా(Social Media)లోనూ యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ అందాలతో కుర్రకారుకు హీట్ పుట్టిస్తోంది. ఈ క్రమంలో ఈ బ్యూటీ ఫొటోస్ నెట్టింట వైరల్‌గా మారాయి. తాజాగా అనన్య తన ఇన్‌స్టాలో వైట్ శారీలో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. మెడలో ముత్యాల నక్లెస్, చేతిలోహ్యాండ్ బ్యాగ్‌, కొప్పు పెట్టుకుని దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story