వెంకటేష్- త్రివిక్రమ్ సినిమాలోకి బోల్డ్ బ్యూటీ ఎంట్రీ.. నటన అందరినీ ఆశ్చర్యపరచబోతుందంటూ పోస్ట్

by Mallepaka Hamsa |

సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘సేవ్ ద టైగర్స్’ ఫేమ్ దేవయాని శర్మ తన బర్త్ డే సందర్భంగా.. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించింది.

వెంకటేష్- త్రివిక్రమ్ సినిమాలోకి బోల్డ్ బ్యూటీ ఎంట్రీ.. నటన అందరినీ ఆశ్చర్యపరచబోతుందంటూ పోస్ట్
X

దిశ, సినిమా: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, వెంకటేష్ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం’(AK47). గతంలో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకు త్రివిక్రమ్ కేవలం డైలాగ్స్ మాత్రమే రాసినప్పటికీ బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించాయి. ఇక ఇప్పుడు ఆ ఐకానిక్ హిట్స్ తర్వాత వెంకటేష్‌ను త్రివిక్రమ్ నేరుగా డైరెక్ట్ చేస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఇందులో వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ భారీ ప్రతిష్టాత్మక చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో నారా రోహిత్, పూజిత పొన్నాడ, రావు రమేష్, బ్రహ్మాజీ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈక్రమంలో.. తాజాగా, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ వార్త బయటకు వచ్చింది. సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘సేవ్ ద టైగర్స్’ ఫేమ్ దేవయాని శర్మ తన బర్త్ డే సందర్భంగా.. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించింది. dop అనే అకౌంట్ నుంచి.. AK-47లో మీ నటన అందరినీ ఆశ్చర్యపరచబోతుందంటూ పోస్ట్ పెట్టగా.. దానికి దేవయాని థాంక్యూ అంటూ రిప్లై ఇచ్చి కన్ఫర్మ్ చేసింది. ఇప్పటికే ఆమె షూటింగ్‌లో కూడా జాయిన్ అయినట్లు సమాచారం. పెద్ద స్టార్స్ ఉన్న సినిమాలో ఛాన్స్ రావడం దేవయాని శర్మ కెరీర్‌కు ఒక పెద్ద మైల్‌స్టోన్ అని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే, దేవయాని శర్మ నటించిన ‘సేవ్ ద టైగర్స్ సీజన్ 3’ వెబ్ సిరీస్ జూన్ 19, 2026న జియోహాట్‌స్టార్‌లో రిలీజ్ కావడానికి రెడీగా ఉంది. ఇటీవలే విడుదలైన ఈ సిరీస్ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

Next Story