ట్రెడిషనల్ లుక్‌లో దర్శనమిచ్చిన బొద్దుగుమ్మ.. లావైనా గ్లామర్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వట్లేగా అంటూ కామెంట్స్

by Gugulothu.Kavitha |

టాలీవుడ్ హీరోయిన్ నివేదా థామస్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

ట్రెడిషనల్ లుక్‌లో దర్శనమిచ్చిన బొద్దుగుమ్మ.. లావైనా గ్లామర్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వట్లేగా అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ నివేదా థామస్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘పెద్ద మనిషి’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ చిన్నది ‘నిన్ను కోరి’ మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దీంతో ఈ చిన్నదానికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ‘జై లవకుశ’, ‘వకీల్ సాబ్’, ‘శాకిని డాకిని’ వంటి సినిమాలతో హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ భామ ‘35 చిన్న కథ కాదు’ మూవీలో చాలా లావు అయి కనిపించింది.

అప్పట్లో స్లిమ్‌గా ఉండే ఈ చిన్నది ఒకేసారి లావు అయి కనిపించడంతో ఆమె ఫ్యాన్స్‌తో పాటు ఆడియన్స్‌కు షాక్‌కు గురయ్యారు. అయితే ఆ సినిమా మంచి విజయం సాధించడంతో మళ్లీ వరుస ఆఫర్లతో బిజీ అయిపోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ప్రజెంట్ ఈ భామ చేతిలో ఎలాంటి ప్రాజెక్ట్‌లు లేనట్టు కనిపిస్తుంది. దీంతో సోషల్ మీడియాకే పరిమితమైంది. అక్కడ నిత్యం యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.

ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా నివేదా తన సోషల్ మీడియాలో కొన్ని ట్రెడిషనల్ పిక్స్ షేర్ చేసింది. అందులో చీర కట్టుకొని జుట్టు వేసుకుని మల్లెపూలు పెట్టుకొని నగలతో సింగారించుకుని కనిపించింది. కొంచెం సిగ్గుపడుతూ కొన్ని ఫొటోస్‌కు స్టిల్స్ ఇచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు లావైనా కానీ గ్లామర్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వట్లేగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story