- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మిథున్ చక్రవర్తికి బీఎంసీ నోటీసులు
ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తికి (Mithun Chakravarthy) ఊహించని షాక్ తగిలింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) షోకాజ్ నోటీసులు (Showcause Notice) జారీ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తికి (Mithun Chakraborty) ఊహించని షాక్ తగిలింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) షోకాజ్ నోటీసులు (Showcause Notice) జారీ చేసింది. మలాడ్ లో ఆయనకు చెందిన ప్రాంతంలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మే 10న బీఎంసీ అధికారులు నోటీసులు పంపారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. గ్రౌండ్ ఫ్లోర్, మెజనైన్ ఫ్లోర్ ను అనుమతి లేకుండా నిర్మించారని, అందుకే నోటీసులు ఇస్తున్నట్లు బీఎంసీ పేర్కొంది.
రెండు అంతస్తుల మధ్య పాక్షికంగా నిర్మించే ఫ్లోర్ ను మెజనైన్ ఫ్లోర్ అంటారు. ఈ నిర్మాణాలతోపాటు ఇటుక గోడలు, చెక్కపలకలు, గాజు అద్దాలు, ఏసీ షీట్లతో కూడిన పై కప్పుతో 10/10 ఫీట్ లో 3 టెంపరరీ నిర్మాణాలను కూడా అనుమతి లేకుండానే చేపట్టినట్లు బీఎంసీ గుర్తించింది. వెంటనే ఆయా నిర్మాణాలను తొలగించాలని, లేదంటే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలోని సెక్షన్ 475 ఏ కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.






