గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ‘బ్లడ్ రోజెస్’

by Sujitha Rachapalli |

ధర్మ కీర్తి రాజు, అప్సర రాణి ప్రధాన పాత్రల్లో వస్తున్న చిత్రం ‘బ్లడ్ రోజెస్’. తాజాగా విడుదలైన ఈ మూవీ టీజర్ ఆకట్టుకుంటోంది. టీబీఆర్ సినీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై కె.నాగన్న, కె లక్ష్మమ్మ సమర్పణలో హరీష్ కమర్తి నిర్మాతగా ఎల్లప్ప కోప్రొడ్యూసర్‌గా ఎంజిఆర్ రచయిత, దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రం టీజర్ చూసిన నటులు సుమన్

గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ‘బ్లడ్ రోజెస్’
X

దిశ, సినిమా : ధర్మ కీర్తి రాజు, అప్సర రాణి ప్రధాన పాత్రల్లో వస్తున్న చిత్రం ‘బ్లడ్ రోజెస్’. తాజాగా విడుదలైన ఈ మూవీ టీజర్ ఆకట్టుకుంటోంది. టీబీఆర్ సినీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై కె.నాగన్న, కె లక్ష్మమ్మ సమర్పణలో హరీష్ కమర్తి నిర్మాతగా ఎల్లప్ప కోప్రొడ్యూసర్‌గా ఎంజిఆర్ రచయిత, దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రం టీజర్ చూసిన నటులు సుమన్, అజయ్ ఘోష్ చిత్ర యూనిట్ సభ్యులను అభినందించారు. త్వరలో విడుదల కాబోతున్న మూవీ తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్పారు. క్రైమ్ థ్రిల్లర్, యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన మూవీ ట్రైలర్ త్వరలో విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఈ చిత్రానికి కెమెరామెన్ ఒగి రెడ్డి శివకుమార్, సంగీతం పెద్దపల్లి రోహిత్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మణికుమార్. కాగా ఈ చిత్రం దాదాపు షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగిందని తెలపారు. ఈ సినిమాలో కీలకపాత్రలో శ్రీలు, క్రాంతి కిల్లి నటించగా.. సుమన్, ఘర్షణ శ్రీనివాస్, టార్జన్, రాజేంద్ర, జూనియర్ రేలంగీ తదితరులు నటించారు. దర్శకుడు ఎంజిఆర్ ఈ సినిమాను గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులు ఎంగేజ్ అయ్యే విధంగా చిత్రీకరణ చేశారు.

Next Story