‘సంక్రాంతికి వస్తున్నాం’ నుంచి బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్

by Kavitha |
‘సంక్రాంతికి వస్తున్నాం’ నుంచి బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్
X

దిశ, సినిమా: విక్టరీ వెంకటేష్(Venkatesh), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam). ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh), మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని.. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్(SVC) బ్యానర్ పై నిర్మాతలు దిల్ రాజు(Dil Raju), శిరీష్(Shirish) రూపొందించారు.

ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌లో వీకే నరేష్(VK Naresh), వీటి గణేష్(VT Ganesh), సాయి కుమార్(Sai Kumar), పమ్మి సాయి(Pammi Sai), సర్వదమన్ బెనర్జీ(Sarwadam Banerjee) తదితరులు నటించారు. అయితే ఈ చిత్రం సంక్రాంతి(Pongal) కానుకగా జనవరి 14న థియేటర్లలో రిలీజ్ అయి స్టార్టింగ్ డే నుంచి కలెక్షన్ల విషయంలో బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు రాబడుతోంది. అలా ఇప్పటి వరకు రూ.303 కోట్లకు పైగా వసూలు చేసినట్లు చిత్రబృదం వెల్లడించింది.

అయితే రిలీజ్‌కి ముందునుంచే ఈ సినిమాపై క్యూరియాసిటీ పెరగడానికి రీసన్ సాంగ్స్ అనే చెప్పాలి. దాదాపు అన్ని పాటలు మ్యూజిక్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి.. ఇక ఇందులో మరీ స్పెషల్‌గా ఆకట్టుకున్న సాంగ్ అయితే ‘గోదారి గట్టు మీద రామసిలకవే’ పాట అనే చెప్పాలి. రమణ గోగుల, మధు ప్రియ ఆలపించిన ఈ సాంగ్ యూట్యూబ్ ట్రెండింగ్ వన్‌గా కూడా విజయం సాధించింది. అయితే తాజాగా ఈ పాట ఫుల్ వీడియో రిలీజ్ అయింది. మరి ఇంకెందుకు ఆలస్యం యూట్యూబ్‌లోకి వెళ్లి మరోసారి ఈ సాంగ్‌ను వినేయండి.

Next Story

Most Viewed