నా మీద చేతబడి జరిగింది.. ఆమెనే చేయించింది.. ఆధారాలతో సహా.. యాంకర్ రవి సంచలనం

by Sujitha Rachapalli |   (  Updated:2025-08-15 11:55:26  IST  )

యాంకర్ రవి.. యాంకరింగ్‌తో ఎంత పేరు తెచ్చుకున్నాడో.. వివాదాలతో కూడా అంతే పేరు తెచ్చుకున్నాడు. ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవి ‘బావగారూ బాగున్నారా’ సినిమాలోని స్పూఫ్ చేసి ఇరుక్కున్న రవి.. తమ మనోభావాలు కించపరిచాడని..

నా మీద చేతబడి జరిగింది.. ఆమెనే చేయించింది.. ఆధారాలతో సహా.. యాంకర్ రవి సంచలనం
X

దిశ, వెబ్ డెస్క్ : యాంకర్ రవి.. యాంకరింగ్‌తో ఎంత పేరు తెచ్చుకున్నాడో.. వివాదాలతో కూడా అంతే పేరు తెచ్చుకున్నాడు. ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవి ‘బావగారూ బాగున్నారా’ సినిమాలోని స్పూఫ్ చేసి ఇరుక్కున్న రవి.. తమ మనోభావాలు కించపరిచాడని.. సారీ చెప్పాలని.. హిందూ సంఘాలు డిమాండ్ చేసినా తగ్గలేదు. తానేమీ తప్పు చేయలేదని.. అలాంటప్పుడు క్షమాపణ ఎందుకు చెప్పాలని ప్రశ్నించాడు. ఇదే విషయాన్ని ఓ పాడ్‌కాస్ట్‌లో కూడా చర్చించాడు.

ఇక ఇదంతా పక్కన పెడితే.. తన సక్సెస్ చూసి ఓర్వని ఓ తోటి యాంకర్.. తనపై చేతబడి చేయించిందని చెప్పాడు యాంకర్ రవి. ఏవో పూజలు చేయించిందని.. ఆధారాలతో సహా తెలుసని చెప్పాడు. కానీ అలాంటివి నమ్మనని.. వాటి జోలికి కూడా పోనని తెలిపిన ఆయన.. స్ట్రాంగ్‌గా ఉన్నంత కాలం తనను ఎవ్వరూ ఏమీ చేయలేడన్నారు. ఇలాంటి విషయాల వల్లనే ప్రశాంతత కోసం కోహ్లీ దేశాన్ని వదిలి వెళ్లిపోయాడని.. హండ్రెడ్ పర్సెంట్ ఆ నిర్ణయం సరైనదన్నాడు. తన కూతురు విషయంలో కూడా తాను అలాగే ఉంటానని.. తన సెక్యూరిటీ, పీస్‌ కోసం ఏదైనా చేస్తానని తెలిపాడు రవి.

Next Story