నాని ‘ది పారడైజ్’ నుంచి ‘బిర్యానీ’ వచ్చేసింది..

by Sujitha Rachapalli |

నేచురల్ స్టార్ నాని ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘ది పారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో SLV సినిమాస్ సుధాకర్ చెరుకూరి ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని నిర్మిస్తున్నారు. ‘దసరా’ బ్లాక్ బస్టర్ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్

నాని ‘ది పారడైజ్’ నుంచి ‘బిర్యానీ’ వచ్చేసింది..
X

దిశ, సినిమా : నేచురల్ స్టార్ నాని ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘ది పారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో SLV సినిమాస్ సుధాకర్ చెరుకూరి ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని నిర్మిస్తున్నారు. ‘దసరా’ బ్లాక్ బస్టర్ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. తాజాగా మేకర్స్ సంపూర్ణేష్ బాబును బిర్యాని పాత్రలో పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. రగ్గడ్ ఇంటెన్స్ లుక్‌లో రక్తంతో తడిచిన చేతులు, బీడీ తాగుతూ, గొడ్డలి పట్టుకొని కనిపించిన సంపూర్ణేష్ బాబు ఫస్ట్ లుక్ అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. ఇప్పటివరకు హ్యుమరస్ రోల్స్ చేసిన ఆయన.. ఇందులో ఇంత ఫెరోషియస్‌గా కనిపించడం టాక్ అఫ్ ది టౌన్‌గా మారింది. ఇప్పటికే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు శికంజ మాలిక్‌ లుక్‌కు అద్భుతమై రెస్పాన్స్ రాగా రాఘవ్ జుయల్ కీలక పాత్రతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. బలమైన క్యారెక్టర్స్‌తో కూడిన కథ ప్రేక్షకులకు విజువల్ స్పెక్టకిల్‌తో పాటు స్ట్రాంగ్ కంటెంట్ అందించడానికి రెడీ అవుతుండా.. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

Next Story