OG Glimpses : పవన్ కల్యాణ్ బర్త్‌డే ట్రీట్ వచ్చేసింది.. వైల్డ్‌గా ఆకట్టుకుంటున్న ‘ఓజీ’ గ్లింప్స్

by Chukka Sudharani |   (  Updated:2025-09-02 16:57:55  IST  )

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు బర్త్‌డే ట్రీట్ వచ్చేసింది.

OG Glimpses : పవన్ కల్యాణ్ బర్త్‌డే ట్రీట్ వచ్చేసింది.. వైల్డ్‌గా ఆకట్టుకుంటున్న ‘ఓజీ’ గ్లింప్స్
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు బర్త్‌డే ట్రీట్ వచ్చేసింది. పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఓజీ’ నుంచి బర్త్‌డే గ్లింప్స్ వచ్చేసింది. ‘డియర్ ఓజీ... నిన్ను కలవాలని, నీతో మాట్లాడాలని.. నిన్ను చంపాలని ఎదురు చూస్తున్నా.. నీ ఓమీ.. హ్యాపీ బర్త్‌డే ఓజీ’ అంటూ విలన్ గంభీరమైన వాయిస్ ఓవర్‌తో స్టార్ట్ అయిన ఈ గ్లింప్స్‌లో పవన్ కల్యాణ్ స్టైల్ అండ్ కత్తి తిప్పే విధానం, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఫ్యాన్స్‌తో పాటు ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకుంటోంది. ప్రజెంట్ ఓజీ బర్త్‌డే గ్లింప్స్ నెట్టింట వైరల్ అవుతుంది.

కాగా.. యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ ప్రతినాయ‌కుడిగా కనిపించనున్నాడు. త‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఆకట్టుకోగా.. భారీ అంచనాల మధ్య ఓజీ చిత్రం సెప్టెంబ‌ర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు గ్రాండ్‌గా సిద్ధం అవుతోంది. లింక్

Next Story