- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rashmika-Vijay Deverakonda: బర్త్ డే స్పెషల్.. బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన రష్మిక- విజయ్ దేవరకొండ.. అస్సలు ఊహించలేరుగా!
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) ‘చలో’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) ‘చలో’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది. ఇక తెలుగులో ఈ అమ్మడు అనతి కాలంలోనే టాలీవుడ్, కోలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించి ఫేమ్ తెచ్చుకుంది. ఇక 2021లో వచ్చిన పుష్ప, యానిమల్ వంటి సినిమాలతో హిట్స్ సాధించి ప్రపంచవ్యాప్తంగా ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. అనతి కాలంలోనే ఈ అమ్మడు నేషనల్ క్రష్‌గా మారిపోయింది. గత ఏడాది వచ్చన ‘పుష్ప-2’ (pushpa-2) చిత్రంతో రష్మిక ఫేమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక ఈ ఏడాది విక్కీ కౌశల్ పరసన చేసిన ‘చావా’(Chhaava) కూడా హిట్ కావడంతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ప్రస్తుతం రష్మిక మందన్న కుబేర, ది గర్ల్‌ఫ్రెండ్(The Girlfriend) వంటి మూవీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నేడు ఆమె పుట్టినరోజు కావడంతో ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా నుంచి అప్డేట్ ఇచ్చారు చిత్రబృందం.
టీజర్ సాంగ్ విడుదల చేస్తూ ఆమె పోస్టర్‌ను షేర్ చేశారు. రేయి లోలోతులో అడియో టీజర్ వీడియోను పెట్టారు. అయితే ఇక దీనికి విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్ అందించడం గమనార్హం. ఇందులో ఆయన ఓ అమ్మాయి దూరం అయిన బాధలో పలు ఎమోషనల్ కొటేషన్స్ చెప్తున్నారు. ప్రేమలో పడ్డాను బహుషా.. కన్నులతో వెన్నెలలే కురిసే అని సాగే పాట ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ‘ది గర్ల్‌ఫ్రెండ్’టీజర్ సాంగ్ ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటోంది. ముఖ్యంగా ఇందులో విజయ్ చెప్పే మాటలు ప్రేమికులను మంత్రముగ్దులను చేస్తున్నాయి.
నయనం నయనం కలిసే తరుణం.. యదనం పరుగే పెరిగే వేగం..నా కదిలే మనసును అడిగా సాయం.. ఇక మీదట నువ్వే దానికి గమ్యం.. అని విజయ్ తన వాయిస్‌తో మెస్మరైజ్ చేశాడు. కాగా, గత కొద్ది రోజుల నుంచి విజయ్ దేవరకొండ, రష్మిక ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు చోట్ల వీరిద్దరు వెకేషన్స్‌కు వెళ్లి కనిపించారు. దీంతో అందరికీ ఈ జంట ప్రేమపై క్లారిటీ వచ్చేసింది. దీనిపై వీరు అధికారికంగా ప్రకటించకపోవడంతో నిత్యం పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే.. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా టీజర్‌కు విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. మొత్తానికి పుట్టినరోజు నాడు సర్‌ప్రైజ్ ఇచ్చారని అంతా చర్చించుకుంటున్నారు. వాయిస్ ఓవర్ ఇచ్చి హింట్ ఇచ్చేశారని ఇలా చేస్తారని ఊహించలేదని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.






