K. Vishwanath's Biography : తెరపైకి కె.విశ్వనాథ్ జీవిత చరిత్ర.. ఆకట్టుకుంటోన్న ప్రోమో

by Chukka Sudharani |   (  Updated:2025-07-31 08:32:32  IST  )

కళా తపస్వీ దిగ్గజ డైరెక్టర్ కె.విశ్వనాథ్ (K. Vishwanath) జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా తెరకెక్కబోతుంది.

K. Vishwanaths Biography : తెరపైకి కె.విశ్వనాథ్ జీవిత చరిత్ర.. ఆకట్టుకుంటోన్న ప్రోమో
X

దిశ, సినిమా: కళా తపస్వీ దిగ్గజ డైరెక్టర్ కె.విశ్వనాథ్ (K. Vishwanath) జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా తెరకెక్కబోతుంది. జనార్ధన మహర్షి (Janardhana Maharshi) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘విశ్వదర్శనం’ (Vishwadarshan) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ బ్యానర్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ (People's Media Factory)పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. తాజాగా ‘విశ్వదర్శనం’కి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు.

ఈ వీడియో స్టార్టింగ్‌లో విశ్వనాథ్‌ దంపతులను చూపించారు. తర్వాత పీ సుశీల, రాధిక శరత్ కుమార్, భాను ప్రియా, సిరివెన్నెల సీతారామశాస్త్రీ, ఆమని, ఎస్‌పీ శైలజ, ఫిలిం రైటర్ విజయేంద్ర ప్రసాద్, తనికెళ్ల భరణి, యండమూరి వీరేంద్రనాథ్, కేవీ రమణ చారీ తదితరులు విశ్వనాథ్‌తో తమకున్న అనుబంధాన్నీ పంచుకున్న బిట్స్ చూపించారు. అనంతరం విశ్వనాథ్ అందుకున్న అవార్డులు, పొందిన పురష్కారాలు తదితర విషయాలను చూపిస్తూ.. తర్వలో మీ ప్రియమైన ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో రాబోతుంది అంటూ తెలిపారు. అయితే.. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ (OTT platform), స్ట్రీమింగ్ డేట్ (Streaming date) మాత్రం అనౌన్స్ చెయ్యలేదు. ప్రజెంట్ విశ్వనాథ్ వీడియో నెట్టింట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Next Story