'బైకర్' సెన్సార్ కంప్లీట్.. రన్ టైం లాక్

by Pulgam srinivas |

బైకర్ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘U/A’ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమా మొత్తం 2 గంటల 42 నిమిషాల 30 సెకండ్ల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది.

బైకర్ సెన్సార్ కంప్లీట్.. రన్ టైం లాక్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యువ నటుడు శర్వానంద్ తాజాగా నటించిన ‘బైకర్’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ బృందం తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ‘U/A’ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా మొత్తం 2 గంటల 42 నిమిషాల 30 సెకండ్ల నిడివితో ప్రేక్షకులను అలరించనుంది.

ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించగా, ‘లూజర్’ వెబ్ సిరీస్ ద్వారా గుర్తింపు పొందిన అభిలాష్ రెడ్డి కంకర ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అలాగే సీనియర్ నటుడు రాజశేఖర్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వంశీ మరియు ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ‘బైకర్’ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

Next Story