‘బైకర్’ మ్యూజిక్ ప్రమోషన్స్‌ని ‘ప్రెట్టీ బేబీ’తో కిక్ స్టార్ట్

by Chukka Sudharani |

చార్మింగ్ స్టార్ శర్వా తన అప్ కమింగ్ మూవీ ‘బైకర్‌’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.

‘బైకర్’ మ్యూజిక్ ప్రమోషన్స్‌ని ‘ప్రెట్టీ బేబీ’తో కిక్ స్టార్ట్
X

దిశ, సినిమా: చార్మింగ్ స్టార్ శర్వా తన అప్ కమింగ్ మూవీ ‘బైకర్‌’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇందులో శర్వ మోటార్‌సైకిల్ రేసర్‌గా కనిపించనుండటంతో ఫ్యాన్స్‌లో ఈ సినిమాపై థ్రిల్ నెలకొంది. మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్నాడు. యూవి క్రియేషన్స్ నిర్మించింది. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు ఇదే జోష్‌తో తాజాగా ‘ప్రెట్టీ బేబీ’ వీడియో సాంగ్‌ని రిలీజ్ చేసిన మేకర్స్ బైకర్ మ్యూజిక్ ప్రమోషన్స్‌ని కిక్ స్టార్ట్ చేశారు. జిబ్రాన్ ఈ పాటని అదిరిపోయే బీట్స్‌తో డ్యాన్సింగ్ నెంబర్‌గా కంపోజ్ చేశారు.

ఈ సాంగ్‌లో శర్వా, మాళవిక నాయర్ కెమిస్ట్రీ అదిరిపోయింది. శర్వా డ్యాన్స్ మూమెంట్స్ మెస్మరైజింగ్‌గా ఉన్నాయి. దీంతో ఈ సాంగ్ ఇన్స్‌స్టంట్ చార్ట్ బస్టర్‌గా నిలిచింది. కాగా.. 1990, 2000 బ్యాక్ డ్రాప్‌లో సాగే ‘బైకర్’ రేసింగ్ యాక్షన్‌తో పాటు ఎమోషనల్, మల్టీ జనరేషనల్ ఫ్యామిలీ డ్రామాగా రాబోతుంది. స్పీడ్, అంబిషన్, హార్ట్‌ఫెల్ట్ రిలేషన్‌షిప్స్‌తో మూడు జనరేషన్స్ ఒకే రేసింగ్ కలతో, కుటుంబ బంధాలతో సాగే అద్భుతమైన ఈ కథ డిసెంబర్ 6న థియేటర్లలో రిలీజ్ కానుంది.

Next Story