'బైకర్' దర్శకుడికి దిల్ రాజు బ్యానర్‌లో ఛాన్స్

by Pulgam srinivas |

బైకర్ చిత్ర దర్శకుడు అభిలాష్ రెడ్డి కంకర తదుపరి మూవీ ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో ఉండబోతున్నట్లు తెలుస్తుంది.

బైకర్ దర్శకుడికి దిల్ రాజు బ్యానర్‌లో ఛాన్స్
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు చిత్రసీమలో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుల్లో అభిలాష్ రెడ్డి ఒకరు. ఈయన లూజర్ వెబ్ సిరీస్‌తో మంచి ప్రశంసలను అందుకున్నారు. ఆ తర్వాత మా నాన్న సూపర్ హీరో అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు లభించినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ విజయాన్ని మాత్రం సాధించలేకపోయింది. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న అభిలాష్ , శర్వానంద్ హీరోగా బైకర్ చిత్రాన్ని రూపొందించారు. ఈ మూవీ ఏప్రిల్ 3న విడుదలై మంచి టాక్‌ను సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.

ఇక తాజాగా అభిలాష్ తదుపరి మూవీ కన్ఫామ్ అయినట్లు సమాచారం. ప్రస్తుతం అందుతున్న వివరాల ప్రకారం, ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో ఈ యువ దర్శకుడి తదుపరి చిత్రం రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓ కథ లాక్ అయినట్లు, ఈ మేరకు ఆ సంస్థ నుంచి అభిలాష్ అడ్వాన్స్ కూడా తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ చిత్రానికి హీరో ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది. నటీనటులు, టెక్నీషియన్లు ఫైనల్ అయిన తర్వాత ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల అయ్యే అవకాశం ఉందని సమాచారం.

Next Story