- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
The Paradise: ఆర్ఎఫ్సీలో భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్.. నాని ప్యారడైజ్‌పై భారీ హైప్
నేచురల్ స్టార్ నాని ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’.

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని భారీగా నిర్మిస్తున్నారు. ‘దసరా’ బ్లాక్ బస్టర్ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతున్న ఈ రెండో ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో భారీ అంచానాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. స్పెషల్‌గా వేసిన మ్యాసీవ్ సెట్‌లో ఫైట్ మాస్టర్ రియల్ సతీష్ సూపర్విజన్‌లో భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నారు.
ఈ హై-ఇన్‌టెన్సిటీ యాక్షన్ సీక్వెన్స్ కోసం రియల్ సతీష్ మాస్టర్‌తో పాటు ఫారిన్ స్టంట్ మాస్టర్స్ కూడా వర్క్ చేస్తున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో హైలెట్‌గా ఉండనుందని తెలుస్తుండగా.. ఈ ఒక్క సీన్‌తో ‘ప్యారడైజ్’ గ్లోబల్ లెవెల్‌కు వెళ్లబోతోందని తెలుపుతున్నారు మేకర్స్. కాగా.. ఈ సినిమా మార్చి 26, 2026న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ 8 భాషలలో విడుదల కానుంది.






