- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chiranjeevi: ‘విశ్వంభర’కు ఆ రెండే బ్యాలెన్స్!
మెగా స్టార్ చిరంజీవి, డైరెక్టర్ వశిష్ట కాంబోలో వస్తున్న లేటెస్ట్ సోషియో-ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’.

దిశ, సినిమా: మెగా స్టార్ చిరంజీవి, డైరెక్టర్ వశిష్ట కాంబోలో వస్తున్న లేటెస్ట్ సోషియో-ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’. తాజాగా ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. అందుతున్న సమాచారం మేరకు.. ‘మెగాస్టార్ చిరంజీవి ఇటీవల చిత్రానికి సంబంధించిన సీజీ అవుట్‌పుట్‌లో 45 నిమిషాల భాగాన్ని చూశారు. ఇది ఆయనకు బాగా నచ్చడంతో తన సంతృప్తిని వ్యక్తం చేశారు. అలాగే.. ప్రస్తుతం ఈ చిత్రానికి ఒక స్పెషల్ సాంగ్ అండ్ కొన్ని రోజుల ప్యాచ్‌వర్క్ మాత్రమే మిగిలి ఉంది.
ఈ స్పెషల్ సాంగ్‌కు భీమ్స్ సంగీతాన్ని అందించబోతున్నారు. ఈ సాంగ్‌తో మౌనీ రాయ్ తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టబోతున్నారు. మేకర్స్ ఈ చిత్రాన్ని 2025 సెప్టెంబర్లో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు’ అంటూ ఫిలిమ్ వర్గాల నుంచి అప్డేట్ వైరల్ అవుతోంది. కాగా.. ఈ సినిమాలో త్రిష కృష్ణన్, ఆషిక రంగనాథ్, కునాల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వి వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎం.ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.






