Ramayana: బాలీవుడ్ రామాయణంపై బిగ్గెస్ట్ అప్డేట్.. ఫస్ట్ గ్లింప్స్ రాబోతుందంటూ పోస్ట్

by Chukka Sudharani |

Ramayana: బాలీవుడ్ రామాయణంపై బిగ్గెస్ట్ అప్డేట్.. ఫస్ట్ గ్లింప్స్ రాబోతుందంటూ పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ‘రామాయణం’ (Ramayana). స్టార్ డైరెక్టర్ నితేష్ తివారీ (Nitesh Tiwari) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని నమిత్ మల్హోత్రాతో కలిసి అల్లు అరవింద్ (Allu Aravind) అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో రాముడి పాత్రలో రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే.. యశ్ రావణుడు పాత్రలో నటిస్తుండగా.. ఆయన సరసన మండోదరి పాత్రలో కాజల్ అగర్వాల్ ఫిక్స్ అయినట్లు సమాచారం. ఇక రెండు పార్టులుగా తెరకెక్కుతోన్న ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడెప్పుడూ వస్తాయా అంటూ ప్రేక్షకులతో పాటు మూవీ లవర్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్‌గా మారింది. ‘రామాయణం మొదటి గ్లింప్స్ కోసం సిద్ధంగా ఉండండి.. భారతీయ సినిమా చరిత్రలోనే అతిపెద్ద అండ్ అత్యంత ప్రతిష్టాత్మక చారిత్రక ప్రాజెక్ట్ కానున్న ఈ మూవీ గ్లింప్స్ జూలై 3న రాబోతుంది. రణబీర్ కపూర్‌ను శ్రీరామ్‌గా, సాయి పల్లవిని మా సీతగా, అండ్ లంకాపతి రావణగా యశ్‌ను చూసేందుకు వేచి ఉండండి’ అంటూ ఓ పోస్ట్ వైరల్ అవుతుండగా.. వెయిటింగ్ అంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. Link

Next Story