- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
The Paradise: జడల్ పాలన ప్రారంభమవుతున్నది.. ది ప్యారడైజ్ నుంచి బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన టీమ్
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది ప్యారడైజ్’.

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది ప్యారడైజ్’. ఈ గ్లోబల్ యాక్షన్ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో ఇప్పటికే వచ్చిన ‘దసరా’ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోగా.. ఈ సెకండ్ కొలబ్రేట్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అంతే కాకుండా.. ఇందులో నాని రెండు జడలతో డిఫరెంట్ లుక్‌లో కనిపించబోతుండగా.. ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.
‘నరకం కాలిపోతుంది.. స్వర్గం పుంజుకుంటుంది.. జడల్ పాలన ప్రారంభమవుతున్నది’ అంటూ నాని రెండు జడలపై ఉన్న బిగ్గెస్ట్ పోస్టర్‌ను షేర్ చేశారు. ప్రజెంట్ ఈ పోస్టర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతుంది. ది ప్యారడైజ్ మూవీ 2026 మార్చి 26న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ అండ్ స్పానిష్ భాషలలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతున్నది. దీనికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. SLV సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. Link






