- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్ బాస్ సీజన్ 9 ప్రోమో వచ్చేసింది..ఈసారి డబుల్ హౌస్ డబుల్ డోస్
టెలివిజన్ ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగులో ఇప్పటికే 8 సీజన్లు పూర్తి చేసుకోగా ఇప్పుడు 9వ సీజన్ కూడా వచ్చేస్తుంది.

దిశ, వెబ్ డెస్క్: టెలివిజన్ ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగులో ఇప్పటికే 8 సీజన్లు పూర్తి చేసుకోగా ఇప్పుడు 9వ సీజన్ కూడా వచ్చేస్తుంది. తాజాగా బిగ్ బాస్ సీజన్ 9 ప్రోమోను మేకర్స్ విడుదల చేయగా ఎంతో ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. ఈ ప్రోమోలో నాగార్జున, వెన్నెల కిషోర్ కనిపించగా సీజన్ గురించి నాగ్ ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టారు. ఈ సీజన్ లో రెండు హౌస్ లు ఉంటాయని నాగ్ హింట్ ఇచ్చారు. డబుల్ హౌస్ డబుల్ డోస్ అని చెప్పారు.
అంతే కాకుండా ఒక హౌస్ లో సెలబ్రెటీలు ఉంటే మరో హౌస్ లో సామాన్యులు ఉంటారని హింట్ ఇచ్చారు. గత ఎనిమిది సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ కు అసలు సంబంధమే లేదని స్పష్టం చేశారు. అంతే కాకుండా ఈ సీజన్ లో ఏకంగా బిగ్ బాస్ నే మార్చేసినట్టు చెప్పారు. ప్రోమో ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో ఈ సారి సీజన్ పై మరిన్ని అంచనాలు పెరిగాయి. మరి ఈ సీజన్ ఎలా ఉండబోతుందో.. హౌస్ లోకి ఎవరెవరు వస్తున్నారో తెలియాలి అంటే ఫస్ట్ ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.






